NTV Telugu Site icon

Pratibha Patil: జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్తో ఇబ్బంది.. ఆస్పత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి

Prathibha Patil

Prathibha Patil

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ (Pratibha Patil) హస్పటల్ లో జాయిన్ అయ్యారు. పుణెలోని భారతీ హాస్పిటల్‌లో బుధవారం నాడు రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం, పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, భారత్‌కు రాష్ట్రపతిగా పని చేసిన తొలి మహిళగా ప్రతిభా పాటిల్‌ చరిత్ర సృష్టించింది.

Read Also: Pakistan: పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మరణశిక్ష రద్దు చేయాలని తీర్మానం..

అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో మాజీ రాష్ట్రపతి పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు.
ఇక, 1962లో ప్రతిభ పాటిల్ మహారాష్ట్రలోని జల్గావ్ నగర నియోజకవర్గం నుంచి మొదటిసారిగా కాంగ్రెస్ శాసనసభ సభ్యులుగా (MLA) అయ్యారు. అప్పటి నుంచి ఆమె 1985 వరకు ఎడ్లాబాద్ (ముక్తాయ్ నగర్) నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 1985 నుంచి 1990 వరకు రాజ్యసభలో పార్లమెంటు సభ్యురాలు (MP)గా పని చేశారు. ఆ తరువాత 1991 సార్వత్రిక ఎన్నికలలో అమరావతి నియోజకవర్గం నుంచి 10వ లోక్‌సభకు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక, ఆమె 2007 నుంచి 2012 వరకు పదవిలో ఉన్నారు. ఇక, ఇప్పటి వరకు పోటీ చేసిన ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోని ప్రత్యేకతను ప్రతిభ పాటిల్ సొంతం చేసుకున్నారు.