Pakistan: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ర్యాలీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ఈ ఫైరింగ్ జరిగింది. గురువారం వజీరాబాద్‌లో ‘నిజమైన స్వాతంత్య్రం’ ర్యాలీ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్‌ఖాన్ కాలికి గాయమైంది. వజీరాబాద్‌లోని జఫరాలీ ఖాన్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. ఆయన ప్రస్తుత క్షేమంగానే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇమ్రాన్‌తో పాటు నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
Palm Oil : ఆయిల్ పామ్ సాగు కోసం అవగాహన సదస్సు.. పోడుభూముల లొల్లి..
ఈ కాల్పుల ఘటనలో ఆయన మేనేజర్ రషీద్, సింధ్ మాజీ గవర్నర్ ఇమ్మాన్ ఇస్మాయిల్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశారు. పీటీఐకి చెందిన నేత ఫరూఖ్ అబీబ్ ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌కు కూడా గాయాలైనట్టు ట్విటర్ వేదికగా తెలిపారు.ఈ కాల్పుల ఘటనపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వజీరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి స్పందించారు. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని త్వరలోనే శిక్షించి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.