Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaysai Reddy New Political Party: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా పక్షంగా పనిచేసేలా పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన కుటంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్‌పై విజయసాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు.
ప్రజల గొంతుకను వినిపించేందుకు నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. వారి తరపున పోరాడే రాజకీయ వేదికగా కొత్త పార్టీని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ నెలలోనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీ పేరు, విధివిధానాలు, జెండా, అజెండా వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణపై ఈ నెలలోనే స్పష్టమైన ప్రకటన చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
Also Read
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- 9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- AP Assembly 2026: నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. పలు కీలక అంశాలపై చర్చ!
మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం లేకుండా దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్‌పై కొనసాగుతున్న ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు.
తాజావార్తలు
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్‌ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
ట్రెండింగ్
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?