Site icon NTV Telugu

Simranjit Singh Mann : అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చిన మాజీ ఎంపీ!

Panjab

Panjab

మండి ఎంపీ కంగనా రనౌత్ కు విపక్షాల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. సొంత పార్టీ బీజేపీ కూడా కంగనా వ్యాఖ్యలను ఖండించింది. తాజాగా ఆమెపై పంజాబ్‌ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్‌ (అమృత్‌సర్‌) నేత సిమ్రాన్‌జీత్‌సింగ్‌ మాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కంగనా రైతుల ఉద్యమం సమయంలో అత్యాచారం, హత్య ఆరోపణలు చేశారు. దీనిపై మీడియా అకాలీదళ్‌ నేత సిమ్‌రంజిత్‌ సింగ్‌ మాన్‌ని ప్రశ్నించగా.. ‘నేను చెప్పక్కర్లేదు. కానీ రనౌత్‌ సాహెబ్‌కు రేప్‌లో చాలా అనుభవం ఉంది. రేప్‌లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగవచ్చు. మీకు సైకిల్ తొక్కడంలో అనుభవం ఉన్నట్లే.. ఆమెకు రేప్‌లో కూడా అనుభవం ఉంది.” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Chicken Biryani: బిర్యానీ తినండి, లక్ష పట్టుకెళ్లండి.. ఓ రెస్టారెంట్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్

కంగనాపై మాన్‌ అనుచిత వ్యాఖ్యలను పంజాబ్‌ మహిళా కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించినట్లేనని.. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు మాజీ ఎంపీ సిమ్రాన్‌జీత్‌సింగ్‌ మాన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

READ MORE: AP Pensions: పింఛన్‌దారులకు శుభవార్త.. ఈ నెల 31నే పింఛన్లు

తాజాగా ఈ వ్యాఖ్యలపై కంగనా ఎక్స్ వేదికగా స్పందించారు. “ఈ దేశంలో అత్యాచారాలను చిన్నచూపు చూడటం ఎప్పటికీ ఆగదని అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు. ఆడవాళ్ళపై అత్యాచారాలు, హింసలు సరదా కోసం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పితృస్వామ్య దేశం యొక్క మనస్తత్వం వారిలో చాలా లోతుగా పాతుకుపోయింది. ఇది ఉన్నత స్థాయి చిత్రనిర్మాత లేదా రాజకీయ నాయకుడైనప్పటికీ.. స్త్రీలను ఆటపట్టించడం లేదా ఎగతాళి చేయడం వంటివి చేసేవారు.” అని రాసుకొచ్చారు.

Exit mobile version