Site icon NTV Telugu

Former MP Ravindra Naik : బీజేపీలో వచ్చింది కేవలం కేసీఆర్ ఓడించేందుకే..

Ravindra Naik

Ravindra Naik

కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ పై రవీంద్ర నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోపు కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్రని డిమాండ్ చేశారు రవీంద్ర నాయక్. నరేంద్ర మోడీ సభకు నాకు ఆహ్వానం లేదని, నరేంద్ర మోడీ సభ సందర్భంగా నాకు అవమానం జరిగింది అన్నమాట వాస్తవమన్నారు. నరేంద్ర మోడీ అవినీతి జరిగింది చెపుతున్నాడు. వెంటనే సుమాటోగా తీసుకోవాలి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Also Read : SS.Thaman: ఇక్కడ ఏ గొట్టంగాడికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..

బీజేపీలో వచ్చింది కేవలం కేసీఆర్ ఓడించేందుకే అన్నారు రవీంద్ర నాయక్‌. సామాజిక న్యాయం, స్వాభిమానం, స్వయం పాలన కోసం తెలంగాణ పోరాటం చేశామన్నారు. కానీ ఇవి ఏమి కేసీఆర్ ప్రభుత్వం లేవని, దేశ సంపాదన దోచుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి ఆధారాలు లేకుంటే విమర్శలు చేయడని, వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Also Read : Perni Nani: జగన్‌పై ద్వేషం.. బాబుపై ప్రేమ.. పవన్ మాటల్లో అది స్పష్టం..

నరేంద్ర మోడీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసాడని, కేసీఆర్ దళితలను సీఎం చేస్తాను అని మోసం చేసాడంటూ ఆయన విమర్శలు గుప్పించారు. సీతక్క ను సీఎం చేస్తాం అని రేవంత్ రెడ్డి అనడానికి స్వాగతిస్తామని, ఒక డైనమిక్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీసీ ఎదుగుతున్న సమయంలో బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుండి తప్పించడం అన్యాయమని మండిపడ్డారు. సంజయ్ ని తొలగిస్తే మరో బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాల్సిందని రవీంద్ర నాయక్ వ్యాఖ్యానించారు.

Exit mobile version