Site icon NTV Telugu

EX.MLC Ramulu Naik : గిరిజనుల భూములు లాక్కోవడమే కేసీఆర్‌ పని

Ex Mlc Ramulu Naik

Ex Mlc Ramulu Naik

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులు మరో పోరాటంకి సిద్దం అవ్వండని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడేందుకు సిద్దం అవ్వండని, పొడు భూములకు పట్టాలు ఇస్తారు అని నమ్మినము.. కానీ మోసం జరిగిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది.. భూములు పంచింది కాంగ్రెస్సే అని ఆయన వెల్లడించారు.

మిగిలి ఉన్న భూములకు కూడా పట్టాలు కాంగ్రెస్ ఇస్తుందని ఆయన తెలిపారు. గిరిజనుల భూములు లాక్కోవడమే కేసీఆర్‌ పని అంటూ ఆయన ఆరోపించారు. గిరిజనులపై కేసీఆర్‌ ప్రభుత్వం దాడులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. గిరిజనులపై కేసులు పెట్టి వేధిస్తుందని, కామారెడ్డిలో గిరిజనులు ఆత్మహత్యయత్నంకి పాల్పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

Exit mobile version