NTV Telugu Site icon

SCV Naidu: చంద్రబాబు నిర్ణయమే నా నిర్ణయం.. పార్టీ మారే ప్రసక్తే లేదు..

Scv Naidu

Scv Naidu

SCV Naidu: నాకు టికెట్‌ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయమే నా నిర్ణయం అని స్పష్టం చేశారు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు.. పార్టీ కోసం కలిసి ఎన్నికల్లో పనిచేస్తాను అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి మాటలు నమ్మొద్దు.. టీడీపీ కోసం ఎన్నో పదవులను పోగొట్టుకున్నాను.. కానీ, పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక బాధ్యత అందరూ కలిసి పనిచేసే పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశాను.. నాకు ఎటువంటి పదవి ఇస్తారో అనేది తెలపాలని కోరారు.. మంచి మెజారిటీతో పార్టీని గెలిపించాల అన్నదే మా లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక, సుదీర్ కు నాకు మద్య వేరే ఆలోచన అపార్థాలు అరమరికలు లేవు అని స్పష్టం చేశారు ఎస్సీవీ నాయుడు.. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాలో శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం విదితమే. మరోవైపు.. తమకు టికెట్‌ రాలేదని కొందరు.. ఈ సారి టికెట్‌ ఇచ్చే అవకాశం లేదనే సమాచారం అందడంతో మరికొందరు నేతలు.. తమ అనరుచరులతో ఆందోళన నిర్వహిస్తున్నారు.. ఇప్పటికైనా తమకే ఈ సీటును కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also: Adah Sharma-Bastar: ‘ది కేరళ స్టోరీ’ మాదిరే.. వివాదంలో అదా శర్మ కొత్త మూవీ!