Site icon NTV Telugu

Pilot Rohit Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి..

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy

Pilot Rohit Reddy: పార్టీ మార్పుపై ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతానని వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు తనపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. గువ్వల బాలరాజును తానే పంపించానని మరికొందరి ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకెళ్తానన్నది అవాస్తవమన్నారు. బీజేపీ తనపై ఎన్ని కుట్రలు చేసిన వారికి లోంగలేదని స్పష్టం చేశారు. సొంత లాభంకన్న తాండురు అభివృద్ధి ముఖ్యమన్నారు. బీఆర్ఎస్‌లో స్తెనికుడిలా పనిచేస్తానని చెప్పారు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవెర్చాలని డిమాండ్ చేశారు. త్వరలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులతో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

READ MORE: HHVM : హరిహార వీరమల్లు నష్టాలు.. తిరుగుబాటుకు రెడీ అవుతున్న బయ్యర్స్

ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆ షాక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తేరుకోక ముందే తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి కారు పార్టీకి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.

Exit mobile version