NTV Telugu Site icon

Kethireddy Venkatarami Reddy: పైలట్ అవతారం ఎత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. కొత్త అవతారం ఎత్తారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం పేరుతో వినూత్నంగా ప్రజల్లోకి వెళ్తూ.. ఆ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపుతూ వచ్చారు.. అయితే, గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. వైసీపీ ఓటమిపై సంచలన విశ్లేషణలు చేశారు.. అయితే, ఇప్పుడు పైలట్ అవతారం ఎత్తారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. ఛాపర్ నడిపి ఔరా..! అనిపించి మరోసారి వార్తల్లో నిలిచారు.. ఛాపర్ లో హైదరాబాద్ పరిసరాల్లో చక్కర్లు కొట్టారు.. సోషల్‌ మీడియాలో కేతిరెడ్డి షేర్‌ చేసిన వీడియోలు.. హైటెక్‌ సిటీ పరిసర ప్రాంతాలను కూడా గమనించవచ్చు..

Read Also: TG Govt: ఆ 400 ఎక‌రాల భూమి ప్రభుత్వానిదే… ప్రాజెక్టులో సెంట్రల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు..

ఇక, తాను ఛాపర్‌ నడిపిన వీడియోను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో షేర్‌ చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. “కలల నుండి వాస్తవికత వరకు – అధికారికంగా పైలట్! అయ్యాను.. ఆకాశం ఇకపై పరిమితి కాదు.. ఇది ప్రారంభం మాత్రమే.. ప్రతి సవాలుకు, ప్రతి పాఠంకు మరియు ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ముందుకు అంతులేని సాహసాలు ఉన్నాయి!.. నేను ఒక్కడిని ఛాపర్‌ ఆకాశంలో ఎగిరిన తొలి ప్రయాణం ఇదే.. అంటూ ట్వీట్‌ చేశారు వైసీపీ నేత, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి..