Andhra Pradesh: సీనియర్ రాజకీయ నాయకుడు కెంబూరి రామ్మోహన్ రావు(75) ఇవాళ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కెంబూరి రామ్మోహన్ రావు 1985లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చీపురుపల్లిలో కెంబూరి నివాసం వద్ద ఆయన పార్ధివదేహానికి పలువురు జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Read Also: IIIT Student Suicide: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య
కెంబూరి రామ్మోహన్‌రావు 1949 సెప్టెంబర్ 1న జన్మించారు. ఈయన 1984 లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో చీపురుపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1984 నుండి 89 వరకు శాసనసభ సభ్యునిగా సేవలు అందించారు. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూసపాటి ఆనంద గజపతిరాజుపై గెలుపొంది పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో అడుగు పెట్టారు…అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1991 మే 21 రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూసపాటి ఆనందగజపతిరాజుపై పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం 1994 ఎన్నికల్లో పత్తి చీపురుపల్లి శాసనసభ్యులుగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1999 చీపురుపల్లి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా కొండ గుర్తుపై పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన ఆరోగ్యం బాగా లేనందున ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.