NTV Telugu Site icon

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించిన మాజీ మిస్ ఇండియా..

Ishika Taneja

Ishika Taneja

మహా కుంభమేళా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. 144ఏళ్లకు ఓ సారి వచ్చే మహా సంగమం ఇది. ఇందులో సాధువులు, ఋషులతో పాటు, పలువురు ప్రముఖులు సైతం ఆకట్టుకుంటున్నారు. సంగమ అమృత జలంలో స్నానం చేయడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా వస్తున్నారు. కాగా.. ఇటీవల ఈ కుంభమేళాకు హాజరైన బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం మహామండలేశ్వర్ గా మారింది. మమత తర్వాత, ఇప్పుడు మరో బాలీవుడ్ యాక్టర్, మాజీ మిస్ ఇండియా కూడా ఈ జాబితాలో చేరింది.

READ MORE: Fire Accident Near YS Jagan Home: జగన్‌ నివాసం సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఘటనా స్థలానికి పోలీసులు

మనం మాట్లాడుతున్న నటి మరెవరో కాదు.. ఆమె పేరే ఇషికా తనేజా. ఇషికా మాజీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టూరిజంటైటిల్‌ను గెలుచుకున్న నటి. ఆమె 2017లో మిస్ ఇండియాగా ఎంపికైంది. ఇప్పుడు సనాతన శిష్యురాలు అయి దీక్ష తీసుకుంది. ఇషిక ద్వారక-శారదా పీఠానికి చెందిన శంకరాచార్య సదానంద సరస్వతి నుంచి గురు దీక్ష తీసుకుంది. ఇషిక ఇప్పుడు శ్రీ లక్ష్మిగా మారింది. ఆమెకు సంబంధించిన చాలా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో ఆమె కాషాయ వస్త్రం ధరించి కనిపిస్తోంది.

\READ MORE: Fire Accident Near YS Jagan Home: జగన్‌ నివాసం సమీపంలో వరుస అగ్ని ప్రమాదాలు.. ఘటనా స్థలానికి పోలీసులు

కాగా.. మిస్ ఇండియా అందాల పోటీలో ‘పాపులారిటీ, మిస్ బ్యూటీ విత్ బ్రెయిన్స్’ టైటిళ్లను గెలుచుకుంది ఇషికా తనేజా.. ఇషికా తనేజా 1994, సెప్టెంబర్ 2న జన్మించింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన ఇందు సర్కార్ సినిమాలో ఒక పాటలో నటించింది. హద్ సినిమాలో రియా పాత్ర పోషించింది. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా.. రాష్ట్రపతి అవార్డును అందుకుంది. 2014 సంవత్సరంలో, ఇషిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.