బోండా ఉమాపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బోండా ఉమా అఫిడవిట్ తప్పుల తడక అని ఆరోపించారు. బోండాపై మూడు ఫిర్యాదులు చేశాం.. సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ లో ఓట్లు నమోదయ్యాయి.. ఎన్నికల నియమావళి ప్రకారం రెసిడెన్షియల్ లోనే ఓట్లు ఉండాలన్నారు. తమ ఫిర్యాదు పై సరైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2014 లో అఫిడవిట్ లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని.. 2019 అఫిడవిట్ లోనూ తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ నే పెట్టినట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ లో సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ ను ఇల్లుగా చూపించారని.. ఆ భవనం ప్లాన్ అప్లై చేసినప్పుడే టీడీపీ పార్టీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారన్నారు.
READ MORE: KCR: తొలి ట్వీట్ చేసిన కేసీఆర్..
పార్టీ ఆఫీస్ లో ఆయన ఎలా నివాసముంటున్నారని ప్రశ్నించారు. పార్టీ ఆఫీస్ లో ఓట్లు ఎలా నమోదు చేస్తారని అడిగారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించారని ఆరోపించారు. అదే రూల్ ఇప్పుడు బోండాకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ ఆఫీస్ లోనే బోండా కుటుంబానికి చెందిన ఐదు ఓట్లు ఉన్నాయన్నారు. బోండా ఉమా అభ్యర్ధిగా పోటీచేసేందుకు అనర్హుడని.. తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. బోండా పై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బోండా తన కుమారుడితో సంబంధం లేదని చెప్పి ఓటు ఇక్కడే చూపించారన్నారు. ఒక కుమారుడు ఇతర దేశంలో ఉంటారని చెప్పి.. ఓటు ఇక్కడే చూపించాడన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బోండా తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. బోండా ఉమా ఓటు రద్దుచేయించే వరకూ పోరాడుతానన్నారు. నేను పక్క నియోజకవర్గం నుంచి వచ్చానంటున్నాడు.. బోండా పక్క నియోజకవర్గం నుంచి రాలేదా అని ప్రశ్నించారు. బోండా ఉమా…అతని సతీమణి…ఇద్దరు కుమారులు..కోడలు ఓట్లు చెల్లవన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్నామని అధికారులను బెదిరిస్తున్నారన్నారు. 2 కోట్ల54 లక్షల 97వేల రూపాయలు ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారని ఆరోపించారు.