విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 206 అడుగుల అంబేద్కర్ మహా శిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమసమాజ స్థాపనకు సీఎం జగన్ నడుంబిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. నిరూపించే సత్తా ఉంటే రండి బహిరంగంగా చర్చకు సిద్ధం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి.. జగనే మళ్లీ సీఎంగా ఉండాలని కిషోర్ బాబు తెలిపారు.
Naga Babu: బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి ఏర్పడటం ఖాయం..
విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల ఎత్తున అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేశారు. రూ.404 కోట్ల వ్యయంతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ స్మృతివనాన్ని తీర్చిదిద్దారు. కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా, కింద పెడస్టల్ భాగం 81 అడుగులు. విగ్రహ పీఠం కింది భాగంలో అంబేడ్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటోగ్యాలరీ, శిల్పాలు, పుస్తకాలతో కూడిన గ్రంథాలయం ఉంది. అంబేడ్కర్ ఎక్స్‌పీరియన్స్, కన్వెన్షన్, యాంపీ థియేటర్, ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. స్మృతివనంలోని భవనం గోడలపై స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నేతల ఫొటోలతో కూడిన కళాఖండాలను తీర్చిదిద్దారు. ఈ విగ్రహం తయారీకి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్ వినియోగించారు. స్మృతివనం ప్రహరీ చుట్టూ 2,200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయిని ఉపయోగించారు. పాలరాతిని అక్కడక్కడ వాడారు. స్మృతివనం చుట్టూ గ్రీనరీతోపాటు వాటర్ ఫౌంటెయిన్లు, ఎలివేషన్ డిజైన్లు ఉన్నాయి.