Site icon NTV Telugu

YSRCP: వైసీపీలోకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. సీఎం జగన్ సమక్షంలో చేరిక

Ravela Kishore Babu

Ravela Kishore Babu

Ravela Kishore Babu Joins YSRCP: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి రావెలను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఇవాళ తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రావెల కిషోర్‌ బాబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైసీపీలో చేరిక, పోటీ చేసే స్థానంపై ఆయన జగన్‌తో చర్చించారు. చర్చ అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.

Read Also: AP Registrations: మొరాయిస్తున్న సర్వర్లు.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సేవలు

ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడూతూ.. వైసీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు. అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయటం ఒక చరిత్ర అంటూ ఆయన కొనియాడారు. అంబేడ్కర్‌ కలలను సాకారం చేసిన వ్యక్తి జగన్ అంటూ ప్రశంసించారు. రూ. 2 లక్షల 53 వేల కోట్ల నిధులను పేదల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేయటం దేశంలోనే ఒక విప్లవమన్నారు.

Exit mobile version