Niranjan Reddy: తెలంగాణ భవన్ లో నేడు (బుధవారం) మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలోని సమకాలీన పరిస్థితుల మధ్య మంత్రులు పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశంలో భాగంగా మాజీమంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంబరాలు చేయడానికి ఈ ప్రభుత్వం కు అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాళ్లు, రప్పలకు రైతు బందు ఇచ్చారని తప్పు పట్టారన్నారు. అయితే ఇప్పుడు కూడా మేము ఇచ్చిన 70 లక్షల మంది రైతులకే మీరు కూడా రైతు భరోసా ఇచ్చారు కదా.. అంటే మీరు కూడా రాళ్లు, రప్పలకు, అనర్హులైన రైతులకే డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించారు.
Read Also: MLC Kavitha: కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు తెలుసు..
అంతేకూండా, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావుడి చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకం ఎత్తివేయబోతుందని హాట్ కామెంట్స్ చేసారు. కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చ పెడతాం అనడం ఏంటి..? గతంలో కేసీఆర్ అసెంబ్లీలో అన్ని విషయాలు చెప్పారన్నారు. మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి.. మా వాళ్లు మాట్లాడుతారని, కేసీఆర్ ఎప్పుడు వచ్చి మాట్లాడాలో మీరు చెప్పడం ఏంటిని ఆయన అన్నారు. బనకచర్ల గురించి మాట్లాడమంటే, కాళేశ్వరం.. కూలేశ్వరం.. అంటున్నాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేసారు.
Read Also:Ganguly Biopic : క్రికెట్ ఐకాన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ పై లేటేస్ట్ అప్‌డేట్..
అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. వరదను అయినా తట్టుకోవచ్చు.. కానీ, రేవంత్ రెడ్డి నోట్లో నుంచి వచ్చే అబద్ధాల వరదను ఎవరూ తట్టుకోలేకపోతున్నారన్నారు. మీకు మా కేసీఆర్ కాదు.. ఏ బీఆర్ఎస్ కార్యకర్త అయినా సమాదానం చెప్తాడన్నారు. మా కేసీఆర్ 11 సార్లు 80 వేల కోట్లు ఇచ్చినా మేము ఇంత హంగామా చేయలేదని.. రుణమాఫీ విషయంలో కేటీఆర్ విసిరిన ఛాలెంజ్ కు సమాధానం లేదన్నారు. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ రావాలి అంటున్నాడు.. 85 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల అడుగుల ఎత్తులో మీరు కట్టండి… కట్టలేక పోతే రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఉరి తీయాలా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పొలాల రేట్లు తగ్గాయని, రేవంత్ రెడ్డిని తెలంగాణకు పట్టిన శని అనుకుంటున్నారని ఆయన మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని బొంద పెట్టబోతున్నారని ఎద్దేవా చేసారు.
