Site icon NTV Telugu

Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్

Jupally

Jupally

Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులతో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన నిర్వహించారు. వరి కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని జూపల్లి కృష్ణారావు కోరారు. అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో రోడ్డుపై బైఠాయించారు. ధర్నా కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డుపై ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ధర్నాలో పాల్గొన్న పలువురు రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also:Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్

మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్ ను నిరసిస్తూ ఆయన అనుచరులు బైక్ కు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరుపుతున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో ఈ రెండు పార్టీల నేతలు చర్చిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఏ పార్టీలో చేరే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కీలక పాత్ర పోషించాలని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు.

Read Also:Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

Exit mobile version