NTV Telugu Site icon

Gangula Kamalakar: 100 రోజుల వరకు ఎదురుచూస్తాం.. మేము రొడ్డేక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దు

Gangula Kamalaker

Gangula Kamalaker

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు ఎదురు చూస్తాం.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నిరసన తప్పదని హెచ్చరించారు. అంతేకాకుండా.. ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తో పాటు.. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని ఆయన అన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదు.. మేము రొడ్డేక్కే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోవద్దు అని అన్నారు.

Read Also: Hyderabad: అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాల కూల్చివేత

నాలుగుసార్లు గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన చివరి క్షణం వరకూ ప్రజల కోసమే పని చేస్తానన్నారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి.. వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల పక్షం ఉండాలి.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాడతామని పేర్కొన్నారు. రైతుబంధు, రుణమాఫీ ఈ నెల 9వ తేదీన వేస్తా అన్నారు.. 19వ తేదీ వచ్చినా వాటి ఉసూ లేదని విమర్శించారు. ప్రభుత్వంపై రైతన్నలు ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరోవైపు ధాన్యం కొనుగోలు పూర్తి అయినా డబ్బులు ఇంకా రాలేదు… ప్రజలు ఆందోళనలో ఉన్నారని గంగుల తెలిపారు.

Read Also: Police Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు