టీడీపీపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయని ఆరోపించారు. పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారని దుయ్యబట్టారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నామని.. ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పానని బాలినేని తెలిపారు.
Dowry Harassment: వరకట్న వేధింపులకు వివాహిత బలి..
సీఎం జగన్ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు నగదు విడుదల చేశారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మళ్లీ పట్టాల పంపిణీ ఆపాలని మరోసారి కోర్టులో పిల్ వేశారని అన్నారు. అర్హులైన పేదలకు అధికారులే పారదర్శకంగా ఎంపిక చేశారు.. భూముల ఎంపికలో కూడా అధికారులే కీలక పాత్ర పోషించారని తెలిపారు. మరోవైపు.. అర్హులైన టీడీపీ వాళ్లకు కూడా పట్టాలు ఇస్తామని బాలినేని చెప్పారు. పట్టాలు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కూడా చీదరించుకుంటారని ఆరోపించారు. భూముల కొనుగోలులో తనకు ఎకరాకు 8 లక్షలు ఇచ్చారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.
PM Modi: రైతులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం పనిచేస్తోంది..ఆందోళనల నేపథ్యంలో పీఎం కీలక వ్యాఖ్యలు..
తన మీద ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని శ్రీనివాస్ తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇస్తామన్నారు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పేద ప్రజలను అన్యాయం చేయాలని చూస్తే సహించం.. ఇలాంటి పనులు చేయటానికి సిగ్గుండాలని చెప్పారు. ఇంటా, బయటా ఇలాంటి వారి వల్ల ఇబ్బందులు పడుతున్నామని బాలినేని పేర్కొన్నారు.