NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా..

Balineni

Balineni

Andhra Pradesh: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున హాజరైయ్యారు. ఇక, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్యేలు కరణం బలరాం, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

Read Also: Tantra: డిఫ్రెంట్ వార్నింగ్‌తో ఆకట్టుకుంటున్న అనన్యనాగళ్ల ‘తంత్ర’ రిలీజ్-డేట్ పోస్టర్!

ఈ సందర్భంగా ఒంగోలు సీఎం జగన్ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఒంగోలులో పేదలకు సొంత ఇంటి కల సాకారం చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పారు. నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వలేకుంటే పోటీ కూడా చేయనని చెప్పా.. సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాను అని ఆయన పేర్కొన్నారు. సీఎం వల్లే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం సాకారమైంది.. గతంలో పేదలకు ఇళ్ళ స్థలాల కోసం యర్రజర్లలో చూసిన ప్రభుత్వ భూమికి టీడీపీ అడ్డంకులు సృష్టించింది.. అందుకే అగ్రహారం, వెంగముక్కలపాలెంలలో భూములు చూశాం.. ఇక్కడ కూడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టాలని చూసింది అని ఆరోపించారు. భూములకు నాకు ఎకరాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.. ఆ ఆరోపణలు రుజువు చేస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తాను అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు.