NTV Telugu Site icon

Alla Nani Resigned to YSRCP: వైసీపీకి బిగ్‌ షాక్‌..! మొన్న పదవులకు.. నేడు ప్రాథమిక సభ్యత్వానికి మాజీ మంత్రి రాజీనామా..

Alla Nani

Alla Nani

Alla Nani Resigned to YSRCP: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. మాజీ మంత్రి ఆళ్ల నాని.. వైసీపీకి రాజీనామా చేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ పోస్టుకు రాజీనామా చేశారు ఆళ్ల నాని.. ఇక, ఈ రోజు వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత బాధ్యతలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొద్దికాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి నిర్ణయించుకోవడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.. భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టుగా పేర్కొన్నారు మాజీ మంత్రి ఆళ్లనాని..

Read Also: Fauji: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పూజతో మొదలైన ప్రభాస్ సినిమా.. లుక్ ఇదే..

గతంలో.. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవి, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్‌ బాధ్యతలకు రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇచ్చాను,, పార్టీకి రాజీనామా అనేది నేను ప్రస్తావించలేదన్నారు ఆళ్ల నాని.. అయితే, నా వ్యక్తిగత కారణాలవల్ల, వ్యక్తిగత బాధ్యతల వల్ల… ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను అన్నారు.. ఇక, పార్టీ ఆఫీసు అంశంలో అపోహలు వద్దన్న ఆయన.. పార్టీ ఆఫీస్ విషయంలో పార్టీ అధిష్టానం దృష్టిలో లేకుండా చేసినట్లు ప్రచారం జరుగుతుంది.. రెండు సంవత్సరాల కాలంగాపార్టీ ఆఫీసుకు స్థలాన్ని లీజుకి తీసుకున్నాం.. స్థలం లీజు అయిపోయిన నేపథ్యంలో తాత్కాలిక షెడ్లను కూల్చివేశారని తెలిపారు. ఎన్నికలకు మూడు నెలల ముందే మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను.. దానిని హ్యాండ్ ఓవర్ చేయమని అప్పుడే చెప్పారని వెల్లడించారు. పార్టీ కార్యాలయం అంశంలో దుష్ప్రచారం జరగడంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.. రిక్వెస్ట్ చేసి మూడు నెలలు అందులో కొనసాగించాం.. ఏలూరులో నూతనంగా నిర్మాణంలో ఉన్నపార్టీ కార్యాలయానికి.. టెంపరరీ అప్రూవల్ ఉంది అని పేర్కొన్నారు మాజీ మంత్రి ఆళ్లనాని..