Site icon NTV Telugu

Yarlagadda VenkatRao: యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..

Tdp

Tdp

గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో న్యాయవాది కేవీ రమణ జాయిన్ అయ్యారు. అంతకు ముందు వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ- జనసేన కలిసి పని చేయాలని యార్లగడ్డ పిలుపునిచ్చారు.

Read Also: Shreyanka Patil: నా పేరు కోహ్లికి తెలుసు.. డ‌బ్ల్యూపీఎల్ స్టార్ ట్వీట్ వైరల్..!

ఇక, విజయవాడలోని యార్లగడ్డ గ్రాండియర్ కళ్యాణ మండపంలో బుధవారం నాడు సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి యార్లగడ్డ వెంకట్రావ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీడీపీతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత పిలుపు మేరకు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పని చేయాలన్నారు. గ్రామ స్థాయిలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం చేస్తూ.. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో టీడీపీ శ్రేణులతో పాటు జనసైనికులకు సైతం తగిన గౌరవం ఉంటుందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భరోసా ఇచ్చారు.

Exit mobile version