NTV Telugu Site icon

Suicide: టీమిండియా మాజీ క్రికెటర్ ఆత్మహత్య.. బిల్డింగ్ పై నుంచి దూకి

David Johnson

David Johnson

టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి దూకి సూసైడ్ కు పాల్పడ్డాడు. డేవిడ్ జాన్సన్ భారత్ తరుఫున రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అతను 1996లో ఇండియా తరుఫున అరంగేట్రం చేశాడు. అదే సంవత్సరంలో తన రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జాన్సన్ కు అవకాశం రాలేదు. కాగా.. డేవిడ్ జాన్సన్ మృతి పట్ల గౌతం గంభీర్, అనిల్ కుంబ్లేతో సహా పలువురు టీమిండియా మాజీ ఆటగాళ్లు నివాళులర్పించారు.

Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. రీల్స్ కోసం భారీగా జనాలు

డేవిడ్ జాన్సన్ కర్ణాటక తరుఫున రంజీ క్రికెట్ లో చాలా కాలం పాటు ఆడాడు. మీడియా కథనాల ప్రకారం.. గురువారం ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లోని నాల్గవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. అతను డిప్రెషన్ బాధితుడు.. డిప్రెషన్ కారణంగా జాన్సన్ ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తనూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని క్రెసెంట్ ఆస్పత్రికి తరలించారు.

Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ భర్త మీకు బాగా తెలిసిన కంపెనీ హెడ్ తెలుసా?

డేవిడ్ జాన్సన్ ఫాస్ట్ బౌలర్.. కానీ అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. 1996 అక్టోబర్లో భారత్ తరుఫున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 1996 డిసెంబర్లో రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతని కెరీర్లో అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్. అతను కర్ణాటక తరుఫున 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 33 లిస్ట్ A మ్యాచ్లు ఆడాడు. 1992లో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతను.. 2002 వరకు చురుకుగా ఉన్నాడు. ఫిట్నెస్, ఫామ్ కారణంగా ఎక్కువ కాలం భారత్కు ఆడే అవకాశం రాలేదు. రెండు టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు.