NTV Telugu Site icon

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

Bishan Sing

Bishan Sing

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ(77) కన్నుమూశారు. బిషన్ సింగ్ బేడీ టీమిండియాలో గొప్ప స్పిన్నర్. అతను 1946 25 సెప్టెంబర్ న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించారు. బిషన్ సింగ్ బేడీ 1966లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసి 13 ఏళ్లపాటు టీమిండియా మ్యాచ్ ల్లో విన్నర్‌గా నిరూపించుకున్నాడు. బిషన్ సింగ్.. 67 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28.71 సగటుతో 266 వికెట్లు పడగొట్టాడు. భారత్ నుంచి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Read Also: Hansraj Raghuvanshi Wedding: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సింగర్

బౌలింగ్‌తో పాటు బిషన్ సింగ్ బేడీకి నాయకత్వ సామర్థ్యం కూడా ఉంది. బిషన్ సింగ్ బేడీ 1976లో టీమిండియాకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అతను 1978 వరకు టీమిండియాకు నాయకత్వం వహించాడు. జట్టులో పోరాట పటిమను నింపి, క్రమశిక్షణకు సంబంధించి కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పిన కెప్టెన్‌గా బిషన్ సింగ్ బేడీకి పేరుంది. కెప్టెన్‌గా బిషన్ సింగ్ బేడీ 1976లో సొంత గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అప్పటి బలమైన జట్టు వెస్టిండీస్‌ను ఓడించాడు.

Read Also: Crossandra Flowers Cultivation : కనకాంబరం సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. బిషన్ సింగ్ బేడీకి క్రికెట్ పై ఇష్టం పోలేదు. చాలా కాలం పాటు బేడీ వ్యాఖ్యాతగా క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. కోచ్‌గా కూడా బిషన్ సింగ్ బేడీ చాలా కాలం క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అంతేకాకుండా.. స్పిన్ విభాగంలో భారత్‌ను పటిష్టంగా ఉంచడానికి, బిషన్ సింగ్ బేడీ కొత్త ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. చివరి క్షణం వరకు భారత క్రికెట్‌కు ముఖ్యమైన సేవలను అందించాడు.