NTV Telugu Site icon

MS Dhoni Cast Vote: ఇదేం క్రేజ్ భయ్యా.. ఓటు వేయడానికి వచ్చిన ధోనికి ఏకంగా?

Dhoni

Dhoni

MS Dhoni Cast Vote: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ నేడు జరుగుతుంది. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి మొదటి దశకు ఈరోజు ఓటింగ్ జరుగుతోంది. తొలి దశలో రాష్ట్రంలోని 43 స్థానాలకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని దాదాపు 1.37 కోట్ల మంది ఓటర్లు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 59.28 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. 43 స్థానాలకు జరుగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు అతని కుటుంబం సభ్యులు మొత్తం మధ్యాహ్నం హతియా అసెంబ్లీలోని బూత్ నంబర్ 380లో ఓటు వేశారు. ఈ సమయంలో మహేంద్ర సింగ్ ధోనీతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఆసక్తి చూపించారు. ఆ సమయంలో భద్రత వలయాలు ప్రజల నుండి ధోనికి రక్షణ కల్పించారు. మహేంద్ర సింగ్ ధోనీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ కూడా.

Read Also: Kulgam Encounter: కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్.. 24 గంటల్లో రెండో ఎన్‌కౌంటర్

మహేంద్ర సింగ్ ధోనీ పోలింగ్ బూత్‌కు చేరుకున్న వెంటనే, అతని అభిమానులు ధోని కోసం అరవడం, కేకలు వేయడంతో అక్కడ కొద్దీ సేపు కోలాహల వాతావరణం ఏర్పడింది. ఈ సంఘటనతో ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో, అతనికి ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమవుతోంది. కొందరు అతడిని కలవడానికి తహతహలాడారు. రాంచీలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ధోనీ ఇల్లు రాంచీ రింగ్ రోడ్‌లో ఉంది. ఓటు వేయడం ద్వారా బాధ్యత గల పౌరుడిగా ఉండాలనే సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read Also: Chennai: తల్లిపై మమకారం.. వైద్యం సరిగా చేయలేదని డాక్టర్‌పై కొడుకు దాడి

Show comments