NTV Telugu Site icon

Razole Assembly: ఉత్కంఠకు తెర.. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్..

Deva Varaprasad

Deva Varaprasad

Razole Assembly: గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకేఒక్క స్థానంలో విజయం సాధించింది.. అదే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం.. అప్పట్లో విజయం సాధించిన రాపాక వరప్రసాద్.. అక్రమంగా అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు.. ఆ పార్టీలో చేరారు.. ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్‌ దేవ వరప్రసాద్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారి దేవ వరప్రసాద్‌ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. ఇక, దేవ వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో రెండు సార్లు ఓడి పోయి జనసేన పార్టీలో చేరిన బొంతు రాజేశ్వరరావు నిన్నటివరకు రాజోలు టికెట్‌ వస్తుందని ఆశించారు.. ఇప్పుడు దేవా వరప్రసాద్‌ను జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బొంతు వర్గం నిరాశలో ఉంది.

Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్

అయితే, రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీలో ఒక ప్రత్యేక అనుంబంధం ఉందని చెప్పవచ్చు.. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో జనసేకు ఎదురుగాలి వీచినా.. రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగిరింది.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌కి విజయాన్ని కట్టబెట్టారు.. కానీ.. ఆయన క్రమంగా జనసేనకు దూరమవుతూ.. వైసీపీకి చేరువయ్యారు.. దీంతో, జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారిపోయినట్టు అయ్యింది.. కానీ, ఈ సారి రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు జనసేనాని పవన్‌ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్‌ కల్యాణ్‌.