Site icon NTV Telugu

LK Advani: ఎల్.కే అద్వానీకి మళ్లీ అస్వస్థత.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరిక

Lk Advani

Lk Advani

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్.కే అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో.. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ విభాగంలో చేరిన ఆయన.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అబ్జర్వేషన్‌లో ఉంచామని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్

గత వారం కూడా ఎల్.కే అద్వానీ న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. డాక్టర్ ఫాలోఅప్ కోసం రావాలని సూచించారు. జూన్ 26వ తేదీన ఆయన ఆరోగ్యం క్షీణించడంతో.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనను రెండ్రోజుల పాటు ఎయిమ్స్‌లోని వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం.. డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మళ్లీ ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు.

Gold Seized: సంగారెడ్డి జిల్లాలో 4.8 కిలోల బంగారం పట్టివేత

ఎల్.కే అద్వానీ 2014 నుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అద్వానీ 2002 నుండి 2004 వరకు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు కేంద్ర హోంమంత్రిగా కూడా పనిచేశారు. బిజెపి ఏర్పాటులో ముఖ్యమైన పాత్రకు పేరుగాంచిన ఆయన భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. మరోవైపు.. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు.

Exit mobile version