Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakesh Mehta: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా తనువు చాలించారు. 74 ఏళ్ల మెహతా నోయిడాలోని సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సెప్టెంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫేజ్-2 పోలీస్ స్టేషన్ బృందం, లోపల నుంచి గడియ పెట్టి ఉన్న తలుపులను పగలగొట్టి చూడగా మెహతా మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్లో, తాను ఎదుర్కొంటున్న మానసిక, ఆరోగ్య సమస్యల కారణంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సంఘటన సమయంలో ఆయన భార్య సుమంతి మెహతా డెహ్రాడూన్‌లోని కుమారుడి వద్ద ఉన్నారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు రంగ్ లోకి దిగారు.
పూర్వ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో 2007 నుంచి 2010 నవంబర్ పదవీ విరమణ వరకు మెహతా ఢిల్లీ సీఎస్ (చీఫ్ సెక్రటరీ)గా సేవలందించారు. ఆయన హయాంలోనే ప్రతిష్టాత్మక 2010 కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఆ సమయంలో ఢిల్లీని ఆధునీకరించే అనేక కీలకమైన రవాణా, విద్యుత్, మౌలిక వసతుల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) కమిషనర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక, మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించగా, సోమవారం లోధి రోడ్ శ్మశానవాటికలో ఆయన దహన సంస్కారాలు ముగిశాయి. ఫోరెన్సిక్ ఆధారాలు, లభ్యమైన సూసైడ్ నోట్ సహాయంతో ఫేజ్-2 పోలీస్ స్టేషన్ అధికారులు ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!