Site icon NTV Telugu

Himanshu : మాజీ ఎమ్మెల్యే మనువడు హిమాన్షుని కొట్టిచంపిన దుండగులు

Himanshu : ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. కోపగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే దివంగత కేదార్ సింగ్ మనవడిని దుండగులు కొట్టి చంపారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం తెలిపారు. కేదార్‌ సింగ్‌ మనవడు హిమాన్షు సింగ్‌ మను జిల్లాలోని మహౌర్‌ గ్రామంలో ఓ పంచాయితీని పరిష్కరించడానికి వెళ్లాడు. అయితే అక్కడ చిన్న పాటి గొడవ జరిగింది. చిలికిచిలికి అదికాస్తా పెద్దదయింది.

Read Also: Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?

దీంతో వైరి వర్గానికి చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది హిమాన్షుపై కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశారు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లి సమీపంలోని మరో గ్రామంలో వదిలేశారు. గుర్తించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. పాత క్షక్షలతోనే ఈ దాడి జరిగిందని మను ఎస్పీ త్రిభువన్‌ త్రిపాఠి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు.

Exit mobile version