Site icon NTV Telugu

YS Jagan: అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలి: మాజీ సీఎం జగన్

Ys Jagan

Ys Jagan

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్‌ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్‌ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..

READ MORE: Minister Ramanaidu: ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!

ప్రపంచ వ్యాప్తంగా ఉండే ముస్లింలందరూ రంజాన్ తర్వాత అతి పెద్ద పండుగ బక్రీదే. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే మూగజీవి.. ఈద్ అంటే పండుగ అని అర్థం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం జిల్హిజా మాసంలో పదో రోజున బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఈ కాలంలో ముస్లింలు వలసలు ఎక్కువగా వెళ్తారు. హిజ్రీ అంటే వలస వెళ్లడం అని అర్థం. ముస్లిలందరూ తమ జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని కోరుకుంటారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, జీవితకాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలనే నియమం ఉంది. అది కూడా కష్టపడి సంపాదించిన సొమ్ముతో, ఎలాంటి స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా, రాగద్వేషాలను వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నానే బక్రీద్ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇదే సమయంలో ఖుర్బానీ ఇస్తారు కాబట్టి దీన్ని ఈదుల్ ఖుర్బానీ అని కూడా పిలుస్తారు. రంజాన్ మాసం ముగిసిన 70 రోజులకు ఈదుల్ అజ్హా పండుగ వస్తుంది.

Exit mobile version