KCR Enquiry: విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం.. బీఆర్కే భవనం వద్ద భారీగా పోలీసు బందోబస్తు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Enquiry: తెలంగాణలో అత్యంత కీలకమైన విచారణలకు వేదికగా మారిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణలో నేడు (జూన్ 11) రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హాజరవుతున్నారు. ఈ విచారణ రాజకీయంగా, పరిపాలనా వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Read Also: Papa Movie: తెలుగులో విడుదలకు సిద్దమైన ఎమోషనల్ మూవీ ‘పా..పా..’
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక విచారణకు ముందుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్‌ను కలిసి చర్చలు జరిపారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మధ్యాహ్నం నుంచే కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. మరికొద్ది సేపట్లో కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరి బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలోని కమిషన్ ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్ (BRK Bhavan)లో కేసీఆర్‌ను విచారించనుంది. ఈ విచారణలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ నాణ్యత లోపాలు, ఆర్థిక అక్రమాలు, పాలనలో అవకతవకలపై ప్రశ్నలు ఎదురవనున్నట్లు సమాచారం.
Read Also: Road Accidents: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి, ఇద్దరు గాయాలు..!
కేసీఆర్ విచారణ సమయంలో బీఆర్ఎస్ నేతలు “చలో బీఆర్కే భవన్” కార్యక్రమానికి పిలుపునివ్వడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లో వందలాది మంది మహిళా కానిస్టేబుళ్లతో సహా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ విచారణకు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు, ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మాజీ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, మహమూద్ అలీ, బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వంటి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!