Former Chief Justice: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో దారుణం జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌కు చెందిన మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని శుక్రవారం మసీదు వెలుపల కాల్చి చంపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఖరాన్ ప్రాంతంలోని మసీదు వెలుపల మహమ్మద్ నూర్ మెస్కంజాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారని, దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడని ఖరాన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అసిఫ్ హలీమ్ చెప్పారు. మాజీ ప్రధాన న్యాయమూర్తిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. మాజీ న్యాయమూర్తి మృతిపట్ల బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలు మరువలేనివని కీర్తించారు.
షరియాకు వ్యతిరేకంగా రిబా ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థను ప్రకటించిన మైలురాయి తీర్పును మెస్కంజాయ్ ఇచ్చారు. క్వెట్టా బార్ అసోసియేషన్ (QBA) అధ్యక్షుడు అజ్మల్ ఖాన్ కాకర్ కూడా మెస్కంజాయ్ హత్యను ఖండించారు. మాజీ జడ్జి మృతి పట్ల పాకిస్థాన్‌లోని ప్రతి పౌరుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని అన్నారు. హంతకులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇది జరిగింది.
LVM3 Rocket: 36 ఉపగ్రహాలతో నింగిలోకి ఎగిరేందుకు ఎల్వీఎం3 సిద్ధం
ఈ నెల ప్రారంభంలోఉగ్రవాద కార్యకలాపాలు బాగా పెరిగిపోయాయని పాకిస్తాన్ న్యాయ శాఖ మంత్రి షహదత్ హుస్సేన్ అంగీకరించారు.ఈ ఏడాది పాకిస్థాన్‌లో అత్యధిక ఉగ్రవాద సంఘటనలు సెప్టెంబర్‌లో నమోదయ్యాయని ఇస్లామాబాద్‌కు చెందిన థింక్ ట్యాంక్ నిషేధిత తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) దాడులను తిరిగి ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో ఉగ్రదాడుల సంఖ్య పెరిగిందని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (పిఐసిఎస్ఎస్)ని ఉటంకిస్తూ డాన్ మునుపటి నివేదికలో పేర్కొంది.