Site icon NTV Telugu

Former Chief Justice Eswaraiah : బీసీలకు జనగణన లేదనడం హాస్యాస్పదంగా ఉంది

Eswaraiah

Eswaraiah

తెలంగాణ బీసీ డిక్లరేషన్ అన్ని రాష్టాలకు ఆదర్శమన్నారు మాజీ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య. బీసీలకు జనగణన లేదనడం హాస్యాస్పదంగా ఉందని, 1931లో చివరి సారిగా బీసీ జనగణన బ్రిటీష్ గవర్నమెంట్ చేసిందని ఈశ్వరయ్య అన్నారు. హిందు రాష్ట్రం కావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని, దీనికి మేము మద్దతు ఇవ్వడం లేదన్నారు. 2011 జాతీయ కుల గణన వివరాలు వెల్లడించకుండ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రాతిల వ్యవహరిస్తున్నాయన్నారు. జాతీయ కుల గణన చేయాలని ఉద్యమం చేసే సమయం ఆసన్నమైందన్నారు. క్రిమిలేయర్ తీసివేయాలి.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నారు.

Also Read : Toll Tax Hike: మళ్లీ పెరిగిన టోల్ ట్యాక్స్.. అమల్లోకి కొత్త ధరలు

అంతేకాకుండా.. ‘మహిళా రిజర్వేషన్లలో బీసీలకు వాటా ఇవ్వాలి. ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడు కేసు ఉందని జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల పై మాట్లాడుతున్నారు. ఉమెన్ రిజర్వేషన్ అడుగుతున్న ఎమ్మెల్సీ కవిత.. బిసి ఉమెన్ రిజర్వేషన్ కావాలని కవిత ఎందుకు అడగటమ్ లేదు? రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఉన్న చితంబర రహస్యం ఏంటి? సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు?. నేను జీవితం ఒక్కసారి కూడా ఫార్వార్డ్ క్లాస్ అభ్యర్థికి ఓటు వేయలేదు. బీసీలను ఎంత అనగా ద్రొక్కితే అంత ఉవ్వెత్తున ఎగిసి పడతారు. దేశంలో సివిల్ వార్ కచ్చితంగా వస్తుంది. అశాంతి వస్తాది.’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Post office franchise: రూ.5000వేలతో పోస్టాఫీసు ఫ్రాంచైజీని తీసుకోండి.. నెలకు లక్ష సంపాదించండి

Exit mobile version