NTV Telugu Site icon

KS Ratnam: బీఆర్ఎస్ కు భారీ షాక్.. రేపు బీజేపీలో చేరనున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

Ks Ratnam

Ks Ratnam

బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మీతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చినందుకు మరియు నన్ను మీ కుటుంబంలో ఒక్కడిగా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం లేఖలో పేర్కొన్నారు. కానీ, గత పది సంవత్సరాల నుంచి నాకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ మీ మీద గౌరవంతో ఒక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతూ వచ్చాను.. కానీ మీరు చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి ఎన్నిక చేయడం పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం నాకు చాలా బాధ కలిగించింది.. నేను చేవెళ్ల నియోజకవర్గం ప్రజల కోసం వాళ్ళ కోరిక మేరకు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్నాను.. కావున పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Babar Azam Captaincy: బాబర్‌ ఆజం కెప్టెన్సీ ఊడుతుందా?.. పాక్‌ క్రికెట్‌ బోర్డు కీలక ప్రకటన

అయితే, బీఆర్ఎస్ పార్టీకి కేఎస్ రత్నం రాజీమానా చేయడంతో చేవెళ్ల నియోజకవర్గంలో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ రసవత్తరంగా సాగే ఛాన్స్ కనిపిస్తుంది. తాజాగా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం కమలం గూటికి చేరుతున్నారు.. ఆయనకు చేవెళ్ల టెకెట్‌ కూడా దాదాపు ఖారారైందని తెలుస్తుంది. ఇక, రేపు ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో బీజేపీకి సైతం ఇక్కడ బలమైన అభ్యర్థి దొరకినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లు ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన వారిలో ప్రభావం చూపే నేతలు లేకపోవడంతో పార్టీలో మార్పు కనిపించలేదు.. ఇక, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన రత్నం నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వ్యక్తి.. సొంత కేడర్‌ ఉండటంతో ఈసారి హోరాహోరీ పోరు తప్పదని ఓటర్లు పేర్కొంటున్నారు.

Read Also: Amalapaul : బర్త్ డే రోజు అమాలాపాల్ కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ ఏం చేసిందంటే?

ఇక, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా కేఎస్ రత్నం చేసిన సేవలు బీజేపీకి కలిసొస్తాయని కమలం పార్టీ భావిస్తోంది. అయితే, అధికార పార్టీలోనే కొనసాగిన రత్నం తనకు టికెట్‌ రాకపోవడంతో పార్టీలోని తన మద్దతుదారులతో టికెట్‌ ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేశాడు.. కానీ, బీఆర్ఎస్ సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో మరోసారి కాలే యాదయ్యకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. దీంతో కాలె యాదయ్యను ఓడించి తీరుతామని కేఎస్ రత్నం బహిరంగంగానే పలుసార్లు ప్రకటించారు. తాజాగా ఆయన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత.. బీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా.. తప్పకుండా ఈ సారి చేవెళ్ల నుంచి పోటీలో ఉంటానని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి ఎలాంటి సపోర్ట్ రాకపోవడంతో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపించారు. ఈ పరిణామం బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. అధికార పార్టీకి చెందిన నేతలు ఆయనతో పాటే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉండటంతో గులాబీకి ఇబ్బంది తప్పదని పొలిటికల్‌ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.