VV Lakshmi Narayana: రక్తంతో లేఖలు రాసి.. నీ రక్తం కళ్ల చూస్తామని బెదిరించారు.. షాకింగ్ విషయాలు చెప్పిన సీబీఐ మాజీ జేడీ..
- ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎన్నో బెదిరింపులు వచ్చాయి..
- రక్తంతో లేఖలు రాసి.. నీ రక్తం కళ్ల చూస్తామని బెదిరించారు..
- భగవత్‌గీతను నమ్ముకున్న నేను భయపడలేదు..
- నా కర్తవ్యాన్ని నేను చేశానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VV Lakshmi Narayana: రక్తంతో లేఖలు రాసి.. నీ రక్తం కళ్ల చూస్తామని గతంలో తనను బెదిరించారని గుర్తు చేసుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహించిన విశేష కార్యక్రమంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 4,028 మంది విద్యార్థులు కలిసి భగవద్గీత 15వ అధ్యాయంలోని 20 శ్లోకాల పారాయణం చేయడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన సేవా కాలంలో ఎదుర్కొన్న షాకింగ్ అనుభవాలను వెల్లడించారు.
Read Also: Realme Watch 5: 1.97-అంగుళాల AMOLED డిస్ప్లే, 16 రోజుల బ్యాటరీ లైఫ్ తో.. రియల్‌మీ వాచ్ 5 రిలీజ్
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
రక్తంతో లేఖలు వచ్చాయి.. నీ రక్తం కళ్ల చూస్తాం అని బెదిరించారు.. సీబీఐలో పనిచేస్తున్న సమయంలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు ఎదురైన విషయాన్ని లక్ష్మీనారాయణ గుర్తుచేసుకున్నారు. నన్ను భయపెట్టేందుకు.. రక్తంతో లేఖలు రాసి పంపారు.. నీ రక్తం కళ్ల చూస్తాం అని బెదిరించారు.. కానీ నేను భయపడలేదు అని తెలిపారు. అయితే, తనను నిలబెట్టింది భగవద్గీతేనని ఆయన స్పష్టంగా చెప్పారు. భగవద్గీత మీద నమ్మకం ఉండటంతోనే ఆ పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడ్డాను. నేను చేయాల్సిన కర్తవ్యాన్ని ఎలాంటి భయం లేకుండా చేశాను అని లక్ష్మీనారాయణ అన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
విద్యార్థుల్లో విలువల పెంపు, ధైర్యం, నిర్ణయశక్తి పెరగడానికి భగవద్గీత ఎంతో తోడ్పడుతుందని చెప్పారు లక్ష్మీనారాయణ.. గీతలో ఉన్న సూత్రాలను నేర్చుకుంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలరు. పిల్లలు భగవద్గీత చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని అభిప్రాయపడ్డారు. దేశ మహనీయులు కూడా భగవద్గీతను ఆశ్రయించారని గుర్తుచేశారు. అహింసవాది మహాత్మా గాంధీ, అలాగే బ్రిటిషర్లను ఆయుధాలతో తరిమికొట్టాలని సంకల్పించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా భగవద్గీతను నమ్ముకున్నారు. అది గీత గొప్పతనాన్ని తెలుపుతుంది అని తెలిపారు. ఇక, భగవద్గీత ప్రపంచానికి మార్గదర్శకమైన గ్రంథం అని, అది మన భారతదేశంలో పుట్టడం మన పుణ్యమని అన్నారు. గీతను చదివిన వారు జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగలరు. అదే నా అనుభవం కూడా అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..