NTV Telugu Site icon

Vinay Bhasker: ఆజాం జాహి మిల్లును మూసింది కాంగ్రెస్ ప్రభుత్వమే..దాస్యం కీలక వ్యాఖ్యలు

New Project (43)

New Project (43)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆజాం జాహి మిల్లును మూసివేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ కు పూర్వవైభవం తీసుకొని రానికి.. మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణానికి కేసీఆర్ కృషి చేశారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏదో విధంగా వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. భారాస నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలపై ఈ ప్రభుత్వనికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

READ MORE: Minister Seethakka: కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు..

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయ ప్రోత్సాహకంగా వరంగల్‌లో 300 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్‌.