Site icon NTV Telugu

Karnataka: కాంగ్రెస్ గూటికి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు..

Congress

Congress

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. గుత్తేదార్ కలబురగి జిల్లా అఫ్జల్‌పూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా కూడా పని చేశారు. ఈ నెల ప్రారంభంలో మాలికయ్య గుత్తేదార్‌ తన సోదరుడు నితిన్ వెంకయ్య గుత్తేదార్‌ను బీజేపీలోకి చేర్చుకోవడంతో గుత్తేదార్ కలత చెందాడు. ఇక, పలు నివేదికల ప్రకారం.. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. శారదా మోహన్‌ను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.

Read Also: Ramdev Baba: రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు మరో షాక్.. పన్ను చెల్లించాల్సిందేనంటూ హుకుం

ఇక, బీజేపీ మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్ శెట్టి 2013 నుంచి 2018 వరకు ఉత్తర కన్నడ జిల్లాలోని కుమటా నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించడంతో ఆమె భారతీయ జనతా పార్టీలోకి మారారు. కాగా, మల్లిఖార్జున్‌ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కలబురగి (గుల్బర్గా) నుంచి బరిలోకి దిగుతున్నారు.

Exit mobile version