Cricket Player: తీవ్ర విషాదం.. అరుదైన వ్యాధితో మరణించిన 38 ఏళ్ల క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్గానిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాపూర్ జద్రాన్ (38) ‘హెమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్’ (HLH) అనే అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా దిల్లీ-ఎన్సీఆర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) అధికారికంగా ధృవీకరించింది.
షాపూర్ జద్రాన్ మృతిపై ACB తీవ్ర దిగ్భ్రాంతిని, సెంతాపాన్ని వ్యక్తం చేసింది. అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు బలమైన పునాది వేసిన ఆటగాళ్లలో షాపూర్ ఒకరు. దేశంలో క్రికెట్ ఎదుగుదలకు ఆయన చూపిన నిబద్ధత, అభిరుచి ఎనలేనివి. మైదానంలో ఆయన పోరాట పటిమ, పట్టుదల భవిష్యత్ తరాల క్రికెటర్లకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
“అఫ్గాన్ క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో షాపూర్ పాత్ర మరవలేనిది. ఆయన చేసిన సేవలు అఫ్గాన్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి” అని ACB కొనియాడింది.
క్రికెట్ కెరీర్..
షాపూర్ జద్రాన్ 2009 నుండి 2020 వరకు అంతర్జాతీయ క్రికెట్లో చురుగ్గా రాణించారు. వన్డేల్లో 44 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టారు. టీ20ల్లో 36 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు సాధించారు.
ప్రాణాంతక వ్యాధి ‘HLH’ అంటే ఏమిటి?
ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపే ‘HLH’ అనేది మానవ రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచే ఒక అరుదైన వ్యాధి. ఇందులో రోగనిరోధక వ్యవస్థ మితిమీరి స్పందించడం వల్ల శరీరంలో తీవ్రమైన వాపు వస్తుంది. ఇది బోన్ మ్యారో, కాలేయం, ప్లీహం, లింఫ్ నోడ్స్ వంటి శరీర కణజాలాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది.
గత ఏడాది అక్టోబర్‌లో షాపూర్ మొదటిసారిగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆయనను భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రారంభంలో చికిత్సకు ఆయన శరీరం బాగానే సహకరించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. కానీ, దురదృష్టవశాత్తూ మళ్లీ సమస్య తిరగబెట్టడంతో పరిస్థితి విషమించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. షాపూర్ మృతితో అఫ్గాన్ క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!