Site icon NTV Telugu

Viral Video: ఓ తల్లి పులి.. మరో పిల్ల పులి.. రోడ్డు బ్లాక్ చేసిన అధికారులు

Medium

Medium

Viral Video: ఓ తల్లి పులిని, దాని పిల్లను రోడ్డు దాటించేందుకు అటవీశాఖ అధికారులు వాహనాలను, ప్రయాణికులను ఆపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహారాష్ట్రలోని తడోబా నేషనల్ పార్క్‌లోని దృశ్యాలివి. ఈ అందమైన వీడియోను వన్యప్రాణి జీవశాస్త్రవేత్త మిలింద్ పరివార్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. వీడియోలో, తల్లి పులి మొదట రోడ్డు దాటుతుంది.. ఆ తరువాత పులి పిల్లలు దాని వెంటే నడిచాయి.

Read Also: TAN CARD: PAN, TAN కార్డుల మధ్య తేడా ఏంటో తెలుసా?

తల్లీ బిడ్డ రోడ్డు దాటేంత వరకు ఫారెస్ట్ గార్డులు వాహనాలను ఆపుతున్న దృశ్యాలను కూడా వీడియోలో చూడవచ్చు. అడవులకు ఆనుకుని ఉన్న రోడ్లు దాటే క్రమంలో వన్యప్రాణులు తరచూ ప్రాణాలు కోల్పోతున్నాయి. రోడ్డుపై వాహనాలు ఢీకొని జంతువులు ప్రాణాలు కోల్పోతుంటే మహారాష్ట్రకు చెందిన ఈ అటవీ అధికారులు వాటిని కాపాడేందు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అటవీశాఖ సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు.

Exit mobile version