NTV Telugu Site icon

Leopard: కుక్క కోసం వచ్చి బోనులో చిక్కిన చిరుత

Leapord

Leapord

నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. అయితే, నిన్న రాత్రి పచ్చర్ల సమీపంలో బోనులో చిరుత చిక్కుకుంది. టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేసిన అటవీ అధికారులు.. కుక్క కోసం వచ్చి బోనులో చిరుత చిక్కుకుపోయింది. మూడు నెలలుగా పచ్చర్ల గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా చిరుత చేసింది.

Read Also: Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో కేసు నమోదు..

అయితే, మెహరున్నీసాను చంపిన చిరుత.. బీబీ అనే మహిళ, దస్తగిరి అనే ఫారెస్ట్ వాహనంపై కూడా దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీల పైనా కూడా చిరుత పులి దాడి చేసింది. దీంతో ఎట్టకేలకు చిరుతను అటవీ శాఖ అధికారులు బంధించారు. చిరుతను బంధించడంతో పచర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, మహానంది సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ పరిసరాల్లో గత ఆరు రోజుల నుంచి ప్రతి రోజు తిరుగుతున్న మరో చిరుత.. భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారిస్తుండటంతో మహనందిలో భారీగా భక్తుల రద్దీ తగ్గిపోయింది.