Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల

Srisailam

Srisailam

శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. రేపటి నుంచి(జూలై 01 2025) ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 31 2025 వరకు ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను నిలిపేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ వారు భద్రతా కారణాలు, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇష్టకామేశ్వరి ఆలయం శ్రీశైలం నల్లమల అడవులలో ఉంది. భక్తులు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తుంటారు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు విరామం ఇచ్చారు అటవీశాఖ అధికారులు. జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీశాఖ వాహనాలు నడుపుతోంది.

Exit mobile version