Telangana: కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మందలో నుంచి ఓ ఏనుగు తప్పిపోయి మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. అటవీ అధికారులు ఎంతో శ్రమించి ఆ ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపించారు. తాజాగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద సంచరిస్తుందన్న సమాచారంతో తెలంగాణ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. “ఏనుగుల మంద వస్తే ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలి” అన్న దానిపై దూలపల్లి అటవీ అకాడమీలో తెలంగాణలో అన్ని జిల్లాల ముఖ్య అటవీ శాఖా అధికారులతో అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి పీసీసీఎఫ్(Hoff) ఆర్‌ఎం డొబ్రియాల్ వర్క్ షాప్ నిర్వహించారు.
Read Also: World Earth Day 2024: ఈ ఏడాది ప్రపంచ ధరిత్రి దినోత్సవం థీమ్ ఏంటో తెలుసా?
ఏనుగుల మంద తిరిగి తెలంగాణలోకి ప్రవేశిస్తే జరిగే సంక్షోభం గురించి వర్క్ షాప్‌లో చర్చించారు. అక్కడున్న గ్రామ ప్రజలకి, రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.ముఖ్యంగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలకి, అవాసాలకి ఎలాంటి హానీ చేయకముందే ఎలా తిరిగి పంపాలన్నా దానిపై జిల్లాల అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలపై అధునాతన సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.