NTV Telugu Site icon

S Jaishankar: యూఏఈ చేరుకున్న విదేశాంగ మంత్రి..హిందూ ఆలయంలో పూజలు

New Project (11)

New Project (11)

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) కి చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు గాజాలో మొత్తం పరిస్థితిపై చర్చిస్తారని భావిస్తున్నారు. నహ్యాన్‌తో సమావేశానికి ముందు, జైశంకర్ ప్రతిష్టాత్మకమైన BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆలయ సందర్శన తర్వాత, జైశంకర్ అబుదాబిలోని బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని సందర్శించి ఆశీర్వాదం పొందినట్లు జైశంకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. భారతదేశం-యూఏఈ స్నేహానికి కనిపించే ఈ చిహ్నం ఈ మందిరమని.. రెండు దేశాల మధ్య నిజమైన సాంస్కృతిక వారధని రాసుకొచ్చారు. జైశంకర్ యూఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను సమీక్షించేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అంతకుముందు పేర్కొంది. ఆదివారం అబుదాబిలో జరిగిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్‌తో కలిసి లౌవ్రే అబుదాబిలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు జైశంకర్ నాయకత్వం వహించారు. ఈ అంశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ ద్వారా తెలిపారు. యోగా ప్రత్యేకతను గురించి రాసుకొచ్చారు.

READ MORE: Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‎లో క్లౌడ్ బరస్ట్.. అస్సాంలో 1.17లక్షల మంది బాధితులు

అనంతరం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం మాట్లాడుతూ.. 1985లో కనిష్క విమానంపై జరిగిన దాడి చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య అని అన్నారు. బాంబు పేలుడు ఘటన జరిగి 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కెనడియన్ నేల నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు పెరుగుతున్న కారణంగా భారత్, కెనడా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. జైశంకర్ ఇంటర్నెట్ మీడియా ప్లాట్‌ఫామ్ “ఎక్స్‌” వేదికగా.. “చరిత్రలో అత్యంత దారుణమైన ఉగ్రవాద చర్య జరిగి 39 సంవత్సరాలు అవుతోంది. ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించబోమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.” అని రాసుకొచ్చారు.”