NTV Telugu Site icon

India Passport Rank: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల్లో భారత్‌ ర్యాంక్ ఇంత దారుణమా.?

India Passport Rank Worldwide

India Passport Rank Worldwide

India Passport Rank Worldwide: హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా తన తన స్థానాన్ని తిరిగి పొందింది. ఈ పాస్ పోర్ట్ ఉపయోగించి రికార్డు స్థాయిలో 195 ప్రపంచ గమ్యస్థానాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తుంది. దింతో సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా మారింది. ఇకపోతే భారతదేశం కూడా పాస్ పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో కాస్త ముందు అడుగు వేసింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్ లో.. భారత పాస్ పోర్ట్ 82వ స్థానంలో ఉంది. ఇది భారతీయులను 58 దేశాలకు వీసా రహిత ప్రవేశానికి అనుమతిస్తుంది.

HDFC FD Rates Hike: ఎఫ్‭డి రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ..

195 దేశాలకు వీసా రహిత ప్రవేశం ఉన్న సింగపూర్ పాస్ పోర్ట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో జపాన్, తరువాత ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ ఉన్నాయి. వీటి పాస్ పోర్ట్ లు ఉపయోగించి 192 దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తాయి. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్ పోర్ట్ లు 191 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో మూడవ స్థానంలో ఉన్నాయి. ర్యాంకింగ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) నుండి డేటా ఆధారంగా ఉంటాయి. ఇక ఆ తర్వాత యూకే, బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆపై అమెరికా 5వ స్థానంలో, ఆస్ట్రేలియా ఆరవ స్థానంలో ఉన్నాయి.

Anasuya : విజయ్ దేవరకొండతో గొడవ.. మీడియాదే తప్పంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్..

ప్రపంచ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ 100వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ పాస్ పోర్ట్ 33 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. పాకిస్తాన్ పాస్ పోర్ట్ 2023లో ప్రపంచంలో 106 వ స్థానంలో ఉంది. ఇక టాప్ 10 ర్యన్క్ వివరాలను ఒకసారి చూస్తే..

అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు 2024 :
సింగపూర్ (195),
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ (192),
ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ (191),
బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ (190),
ఆస్ట్రేలియా, పోర్చుగల్ (189),
గ్రీస్, పోలాండ్ (188),
కెనడా, చెకియా, హంగరీ, మాల్టా (187),
యునైటెడ్ స్టేట్స్ (186),
ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (185),
ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా (184).

Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’

బ్రిటన్ కు చెందిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత్ 82వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇవ్వబడింది. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో 2023 లో భారతదేశం 84 వ స్థానంలో ఉంది. భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

Show comments