Site icon NTV Telugu

Smriti Mandhana: స్మృతీ మంధానతో రిలేషన్‌ను అందుకే గోప్యంగా ఉంచా: పలాష్

Palaash Muchhal Smriti Mandhana

Palaash Muchhal Smriti Mandhana

టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్‌ స్మృతీ మంధాన తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత జులైలో 27వ పుట్టినరోజు సందర్భంగా స్మృతీ తన బాయ్‌ఫ్రెండ్‌ పలాష్ ముచ్చల్‌ను పరిచయం చేశారు. తమ రిలేషన్‌కు ఐదేళ్లు పూర్తైందని పలాష్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. మొన్నటివరకు తమ ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డ ఈ జంట.. ప్రస్తుతం జంటగా తిరుగుతున్నారు. కానీ స్మృతీ, పలాష్‌లు బహిరంగంగా ఒకరి గురించి ఒకరు ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు.

ఇన్ని రోజులు స్మృతీ మంధానతో రిలేషన్‌ను గోప్యంగా ఎందుకు ఉంచాడో తాజాగా పలాష్ ముచ్చల్‌ చెప్పాడు. ‘నాకు సిగ్గు, బిడియం కాస్త ఎక్కువ. ఈవెంట్, పార్టీల్లో ఫొటోలు దిగే సమయంలోనూ సిగ్గుపడతాను. స్మృతీ మంధాన బాయ్‌ఫ్రెండ్‌ని అయినందుకు నేను గర్వపడుతున్నా. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతా. అందుకే ఇన్ని రోజులు మా రిలేషన్‌పై మాట్లాడలేదు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ సమయంలో నేను స్మృతీతో మైదానంలో ఉన్నప్పుడు కెమెరాను చూడలేదు. కెమెరా మా వైపు తిరిగిందంటే.. అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని. ఇప్పుడు మా రిలేషన్‌ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటివి చేయడం లేదు. అయితే నేను నేను ఎక్కడికి వెళ్లినా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ.. అంటూ ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు. అది నాకు సంతోషంగానే ఉంది’ అని పలాష్ తెలిపాడు.

Also Read: Prabath Jayasuriya: 17 మ్యాచ్‌లలో 100 వికెట్స్.. చరిత్ర సృష్టించిన జయసూర్య!

గత మేలో పలాష్‌ ముచ్చల్‌ పుట్టినరోజు సందర్భంగా స్మృతీ మంధాన అతడితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పలాష్‌ చేతిపై ‘SM18’ అనే టాటూ చూసి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు మొదలయ్యాయి. కొద్ది రోజులకే స్మృతి తమ రిలేషన్‌ను ప్రకటించింది. పలాష్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ అన్న విషయం తెలిసిందే. తెలియని విషయం ఏంటంటే.. అతడు పేద పిల్లలకు నిధులు కేటాయించడం కోసం స్టేజ్‌షోలు నిర్వహిస్తుంటాడు. భారత్‌ సహా విదేశాల్లోనూ పలు స్టేజ్‌షోలు చేస్తుంటాడు.

Exit mobile version