Smriti Mandhana: స్మృతీ మంధానతో రిలేషన్‌ను అందుకే గోప్యంగా ఉంచా: పలాష్
- బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన స్మృతీ
- పలాష్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్
- స్మృతీతో రిలేషన్‌పై స్పందించిన పలాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతీ మంధాన తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. గత జులైలో 27వ పుట్టినరోజు సందర్భంగా స్మృతీ తన బాయ్‌ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‌ను పరిచయం చేశారు. తమ రిలేషన్‌కు ఐదేళ్లు పూర్తైందని పలాష్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మొన్నటివరకు తమ ప్రేమ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డ ఈ జంట.. ప్రస్తుతం జంటగా తిరుగుతున్నారు. కానీ స్మృతీ, పలాష్‌లు బహిరంగంగా ఒకరి గురించి ఒకరు ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు.
ఇన్ని రోజులు స్మృతీ మంధానతో రిలేషన్‌ను గోప్యంగా ఎందుకు ఉంచాడో తాజాగా పలాష్ ముచ్చల్ చెప్పాడు. ‘నాకు సిగ్గు, బిడియం కాస్త ఎక్కువ. ఈవెంట్, పార్టీల్లో ఫొటోలు దిగే సమయంలోనూ సిగ్గుపడతాను. స్మృతీ మంధాన బాయ్‌ఫ్రెండ్‌ని అయినందుకు నేను గర్వపడుతున్నా. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతా. అందుకే ఇన్ని రోజులు మా రిలేషన్‌పై మాట్లాడలేదు. మహిళల ప్రీమియర్ లీగ్ సమయంలో నేను స్మృతీతో మైదానంలో ఉన్నప్పుడు కెమెరాను చూడలేదు. కెమెరా మా వైపు తిరిగిందంటే.. అక్కడి నుంచి వెళ్లిపోయేవాడిని. ఇప్పుడు మా రిలేషన్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అలాంటివి చేయడం లేదు. అయితే నేను నేను ఎక్కడికి వెళ్లినా ఆర్‌సీబీ, ఆర్‌సీబీ.. అంటూ ఫాన్స్ కేరింతలు కొడుతున్నారు. అది నాకు సంతోషంగానే ఉంది’ అని పలాష్ తెలిపాడు.
Also Read
Also Read: Prabath Jayasuriya: 17 మ్యాచ్‌లలో 100 వికెట్స్.. చరిత్ర సృష్టించిన జయసూర్య!
గత మేలో పలాష్ ముచ్చల్ పుట్టినరోజు సందర్భంగా స్మృతీ మంధాన అతడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పలాష్ చేతిపై ‘SM18’ అనే టాటూ చూసి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు మొదలయ్యాయి. కొద్ది రోజులకే స్మృతి తమ రిలేషన్‌ను ప్రకటించింది. పలాష్ మ్యూజిక్ కంపోజర్ అన్న విషయం తెలిసిందే. తెలియని విషయం ఏంటంటే.. అతడు పేద పిల్లలకు నిధులు కేటాయించడం కోసం స్టేజ్‌షోలు నిర్వహిస్తుంటాడు. భారత్ సహా విదేశాల్లోనూ పలు స్టేజ్‌షోలు చేస్తుంటాడు.
తాజావార్తలు
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
-
Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
-
PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..
-
DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
-
Polavaram District: ఏపీలో విషాదం.. ఒకే ప్రియుడి కోసం ఇద్దరు యువతులు ఆత్మహత్య..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!