Site icon NTV Telugu

Minor Case: మైనర్‌పై జరిగిన రేప్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

Court

Court

2017లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఎల్‌బీ నగర్ కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.ఈ కేసులో నిందితుడు మహ్మద్ కాజా మొయినుద్దీన్ (19)కు పదేళ్ల శిక్ష జైలు శిక్ష మరియు రూ. 11,000 జరిమానా., బాధితురాలికి రూ.1,00,000 పరిహారం వెంటనే చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

Also read: Lucky Boy: కాస్త ఆలస్యమైనా పిల్లడు ఉండేవాడు కాదు.. వైరల్ వీడియో..

మే 2017లో సరూర్‌నగర్‌‌ లోని కర్మాన్‌ఘాట్‌ కు చెందిన 19 ఏళ్ల ఓ ప్రైవేట్ ఉద్యోగి మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను చాక్లెట్ కోసం అని చెప్పి తన ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి ఖాజా మొయినుద్దీన్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక చివరగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు తుది తీర్పును ప్రకటించింది.

Exit mobile version