Duleep Trophy 2024: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2024 రెండో రౌండ్ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్లలలో సెలక్షన్ కమిటీ మార్పులు చేసింది. తొలి రౌండ్‌లో భారత్ A జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్, అతని జట్టులోని కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ రెండో రౌండ్‌లో పాల్గొనరు. నిజానికి ఈ ఆటగాళ్లందరూ బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు భారత జట్టులో ఎంపికయ్యారు. ఇకపోతే., గిల్ గైర్హాజరీతో భారత్-A జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గిల్ స్థానంలో రైల్వేస్‌కు చెందిన ప్రథమ్ సింగ్, రాహుల్ స్థానంలో విదర్భకు చెందిన అక్షయ్ వాడ్కర్, జురెల్ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎస్‌కే రషీద్ లను సెలక్టర్లు చేర్చారు. అలాగే కుల్దీప్ స్థానంలో ముంబైకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షమ్స్ ములానీని జట్టులోకి తీసుకోగా.., ఆకాశ్‌దీప్ స్థానంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆకిబ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
Divorce: విడాకుల తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన దుబాయ్ ప్రిన్సెస్.. డివోర్స్ అంటూ..
ఇండియా -B జట్టు నుంచి తొలి రౌండ్‌లో ఆడిన యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్‌ల స్థానంలో సుయాష్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. అలాగే బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపికైన యశ్ దయాల్, సర్ఫరాజ్ ఖాన్‌లు దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉంటారు. వీరితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన హిమాన్షు మంత్రిని ఇండియా-B జట్టులోకి చేర్చారు. ఈ మార్పులతో జట్ల వివరాలను ఒకసారి చూస్తే..
ఇండియా A : మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ర్యాన్ పరాగ్ , తిలక్ వర్మ , శివమ్ దూబే, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుషాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, ఎస్కే రషీద్, షమ్స్ ములానీ, ఆకీబ్ గని.
ఇండియా B : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయ్యాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్).
ఇది ఇలా ఉండగా భారత్-Dలో అక్షర్ పటేల్ స్థానంలో నిశాంత్ సింధు ఆడనున్నాడు. తుషార్ దేశ్‌పాండే గాయం కారణంగా రెండో రౌండ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో విద్వాత్ కవరప్పను చేర్చారు. ఆసక్తికరంగా, ఇండియా-C లో ఎలాంటి మార్పు లేదు. ఈ మార్పులతో ఇండియా-సి, ఇండియా-డి జట్లు ఇలా ఉండనున్నాయి.
ఇండియా C : రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), బాబా ఇందర్‌జీత్, హృతిక్ షౌకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, విశాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే (మయాంక్ మార్కండే), సందీప్ వారియర్.
ఇండియా D : శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాంశ్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్, సంజూ శామ్‌సన్, నిశాంత్ సింధు, విద్వాత్ కవరప్ప.