Divorce: విడాకుల తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన దుబాయ్ ప్రిన్సెస్.. డివోర్స్ అంటూ..
- భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత దుబాయ్ యువరాణి కొత్త పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది.
- ఈ పెర్ఫ్యూమ్కి ' డివోర్స్' (విడాకులు) అని పేరు పెట్టారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divorce Perfume: తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత దుబాయ్ ప్రిన్సెస్ కొత్త పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పెర్ఫ్యూమ్కి ‘ డివోర్స్’ (విడాకులు) అని పేరు పెట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత, మోసం చేసిన వ్యక్తి చూస్తూనే ఉండేలా చేసే అనేక పనులు మీరు తరచుగా సినిమాల్లో చూసి ఉంటారు. దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె యువరాణి షేఖా మహరా కూడా తాజాగా అలాంటి పనే చేసింది. విడాకుల తర్వాత ఆమె ఒక పెర్ఫ్యూమ్ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దుబాయ్ ప్రిన్సెస్ పెర్ఫ్యూమ్ లాంచ్ చేయడం పెద్ద విషయం అయితే.. ఆ పెర్ఫ్యూమ్కి ‘డివోర్స్’ అని పేరు పెట్టడం ఇంకా విశేషం.
Also Read
- Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన "ఇండియాస్ మావోయిస్ట్స్" పుస్తకావిష్కరణ
- Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
దుబాయ్ ప్రిన్సెస్ షేఖా మహ్రా తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ‘డివోర్స్’ పెర్ఫ్యూమ్ చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో ‘డివోర్స్ బై మహర్ M1’ అని రాశారు కూడా. ఈ పోస్ట్ చూసిన తర్వాత ప్రజలు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా స్వేచ్ఛ యొక్క సువాసన ఉంటుంది అని కొందరు కామెంట్ చేయగా.. ఎంత సృజనాత్మకత., ఈ పోస్ట్‌ని చూసి మీ మాజీ భర్తకు అసూయ కలిగి ఉంటుందని అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. మీరు చేస్తున్న పని సరైనదే. ఈ ప్రకటన చూసిన తర్వాత డివోర్స్ అనే పరిమళాన్ని ప్రయోగించి షేక్ మెహ్రా వేసిన బాణం సరైన లక్ష్యాన్ని చేధించేలా కనిపిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇకపోతే ఇదివరకు షేఖా మెహ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆమె పోస్ట్‌లో ప్రియమైన భర్త.., మీరు మీ స్నేహితులు, ఇతర వ్యక్తులతో చాలా బిజీగా ఉన్నారు. ఈ కారణంగా నేను మీకు విడాకులు ఇస్తున్నాను.., జాగ్రత్తగా ఉండండి.. ఇటు మీ మాజీ భార్య అంటూ రాసుకొచ్చింది. ఇకపోతే., షేఖా మెహ్రా తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పుడు ఆమె వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె విడాకులు ఇచ్చే తీరు జనాలకు నచ్చింది. ఆ క్షణంలోనే ఆమె తన భర్తను కూడా అన్‌ఫాలో చేసింది. దీనితో పాటు, ఆమె తన భర్తతో ఉన్న అన్ని పోస్ట్‌లను కూడా తొలగించింది. అతనికి గతేడాదే పెళ్లయింది. వారిద్దరికీ ఓ కుమార్తె కూడా ఉంది. కానీ ఒక సంవత్సరం తర్వాత వారిద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు.
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!