Mrunal Thakur : 7 ఏళ్ల ఆశ.. మృణాల్ కోరిక తీర్చేదెవరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్ లక్ తోక తొక్కిందా, ప్లాప్స్ ఉన్నా మేడమ్‌కు బాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుందా, బీటౌన్‌లో వరుస ఛాన్సులివ్వడం వెనుక టాలీవుడ్ కారణమా అంటే కచ్చితంగా యస్ చెప్పుకోవాల్సిందే సీతా మహాలక్ష్మీ. బుల్లితెర నుండి సిల్వర్ స్క్రీన్‌పైకి దూసుకొచ్చిన మృణాల్ కెరీర్ తొలి నాళ్లలో హృతిక్ సూపర్ 30, బాట్లా హౌస్ అంటూ హిట్స్ కొట్టింది, కరోనా ఎఫెక్ట్ వల్ల ఓటీటీలోకి పరిమితమైన ఈ భామ… జెర్సీతో థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తే.. రిజల్ట్ ఫ్లాప్. అదే టైంలో టాలీవుడ్‌లో సీతామాహాలక్ష్మీగా ఎంటరై… భారీ సక్సెస్ తెచ్చుకోవడంతో మేడమ్ క్రేజ్ అమాంతం పెరిగింది.
Also Read : Dhurandhar OTT Responce : నెట్ ఫ్లిక్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ధురంధర్
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్‌బస్టర్!!
టాలీవుడ్ సీతామహాలక్ష్మీగా మారాక మళ్లీ బాలీవుడ్ బాట పట్టిన మృణాల్‌కు గుమ్రా, ఆంఖ్ మిచోలీ డిజాస్టర్లుగా మారాయి. గోస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ సిరీస్ చిత్రాలతో కాస్తో కూస్తో ఇమేజ్ నిలబడింది. తెలుగులో హాయ్ నాన్న హిట్టు మరోసారి ఆమె కెరీర్‌కు బూస్టర్ అయ్యింది. ఇలా ఆమె బీటౌన్ ముంగిట్లో ఫెయిలవుతున్న ప్రతిసారి టాలీవుడ్ ఆదుకుంది. ఇక గత ఏడాది వచ్చిన సన్నాఫ్ సర్దార్2 డిజాస్టర్. 7 ఏళ్ల నుండి బాలీవుడ్‌లో హిట్టే చూడని మృణాల్‌కు నార్త్ బెల్ట్ వరుస ఆఫర్లు ఇచ్చి.. రెడ్ కార్పెట్ వేయడం విడ్డూరమే అయినప్పటికీ.. సౌత్‌లో ఉన్న క్రేజే ఆమెకు ఛాన్సులు వచ్చేలా చేస్తున్నాయి. ప్రజెంట్ మృణాల్ దో దీవానే శెహర్ మే రొమాంటిక్ లవ్ స్టోరీతో బాలీవుడ్‌లో లక్ పరీక్షించుకోబోతుంది. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఫిల్మ్. అలాగే బైలింగ్వల్ మూవీ డెకాయిట్ నెక్ట్స్ మంత్ రిలీజ్ కావాల్సి ఉండగా.. పోస్ట్ పోన్ అవుతుందన్న స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ఇవే కాకుండా మేడమ్ చేతిలో హాయ్ జవాని తో ఇష్క్ హోనా హై, పూజా మేరీ జాన్ చేస్తోంది. మరీ ఈ సినిమాలతో ఏడేళ్ల తర్వాత మృణాల్ బీటౌన్‌లో హిట్ అందుకుందో లేదో ఈ మంత్ ఎండింగ్‌కు తేలిపోనుంది…
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!