NTV Telugu Site icon

Bridge Collapse: పూంచ్‌ సెక్టార్‌లో గాలివాన దెబ్బకి కూలిన బ్రిడ్జ్..

Poonch

Poonch

జమ్ము కశ్మీర్‌లోని పూంచ్‌ సెక్టార్‌లో గాలివానలు బీభత్సం సృష్టిస్తుంది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు పడుతున్నాయి. ఈదురు గాలుల ధాటికి కలానీ – చక్తో గ్రామాల మధ్య ఓ నదిపై ఉన్న వంతెన దెబ్బ తిన్నది. దాంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనపై స్థానికులు మాట్లాడుతూ.. ఇవాళ సాయంత్రం భారీ వర్షంతో పాటు ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో వంతెన కూలిపోయిందని చెప్పుకొచ్చారు. ఈ వంతెన కూలిపోవడంతో తమ ప్రాంతానికి ఉన్న కనెక్టివిటీ తెగిపోయిందన్నారు. బ్రిడ్జి కూలిన సమయంలో దాని గుండా ఎలాంటి రాకపోకలు జరగకపోవడంతో పెను ప్రమాదం దప్పిందన్నారు.

Read Also: Etela Rajendar: బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఇక సాధ్యం కాదు..

కాగా, కలానీ – చక్తో గ్రామాల మధ్య జనం కాలినడకన రాకపోకలు కొనసాగించేందుకు నదిపై ఇనుప వంతెనను ఏర్పాటు చేయగా.. బలమైన గాలుల ధాటికి ఈ వంతెన పూర్తిగా దెబ్బ తినడంతో స్థానిక అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా పూంచ్ జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తుండగా, శుక్రవారం నాడు ఈదురు గాలులు వీయడంతో ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి. ఇక, ఈ వంతన కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.